Advertisements

"Katha Patasala"

తెలుగు వారికి తెలుగులో కథలు అందించాలన్న ఆకాంక్షతో మొదలైనదే మన ఈ "కథాపాఠశాల".

About Us

కథా పాఠశాల / KathaPatasala

ఈ విశ్వమంతా నిండి వున్నవి కోట్లాది పరమాణువులు కావు…

కోకొల్లలుగా చెప్పుకొనే “కథలు”…

కాశీ మజిలీ కథలు, విక్రమార్క భేతాళ కథలు, చందమామ కథలు,

తాతయ్య చెప్పిన “నీతి కథలు”

ఆకాశంలో చుక్కల్ని చూపిస్తూ నాన్నమ్మ చెప్పిన “చిట్టడవి కథలు”

చందమామను చూపిస్తూ అమ్మ చెప్పిన “గోరుముద్ద కథలు”

నిద్రబుచ్చుతూ నాన్న చెప్పిన “సాహస కథలు”

చరిత్ర చెప్పిన రాజుల కథలు, అరేబియన్ నైట్స్ ఆలీబాబా కథలు..

రోమియో జూలియట్, లైలా మజ్ను “ప్రేమకథలు”

రామాయణ, మహా భారత, భాగవతాది “భారతీయ కథలు”

చెప్పుకుంటూ పోతే అనగనగా అంటూ మొదలై అంతంలేక మన జీవితాల్లో మమేకమైన కథలు మరుగున పడుతున్న సమయంలో.. తిరిగి ఆ కథలను బ్రతికించేందుకు మొదలైందే మన  – “కథా పాఠశాల“.

==========================================

By

KathaPatasala Team

Be Part Of Our Story!!

%e0%b0%95%e0%b0%a5%e0%b0%b2-%e0%b0%ac%e0%b1%8d%e0%b0%af%e0%b0%be%e0%b0%82%e0%b0%95%e0%b1%81

కథా పాఠశాల ఇచ్చిన స్పూర్తితో వేసిన మరో అడుగే మన కథా బ్యాంకు..

ఒక్క మాటలో చెప్పాలంటే “కథా అక్షయపాత్ర”… తోడుతున్న కొలదీ కథలే కథలు..

మరి మా కథలతో పాటు మీ కథలను కూడా జోడించే అవకాశం మీకిస్తుంది మన కథా బ్యాంకు..

మీరొక కథచెప్పి మన బ్యాంకులో డిపాజిట్ చేస్తే దానికి వడ్డీగా మేమొక కథ మన బ్యాంకులో జమచేస్తాం..

అలా కథా నీరు పోసి ఓ తరగని చెట్టుగా అభివృద్ధి చేసి భవిష్యత్తు తరాలకు అందించే ఆలోచనే మన కథా బ్యాంకు..

మీ కథా ఖాతాలకోసం ఎదురు చూస్తూ వుంటాం.

BeFunky Collage

Advertisements