గౌతమ బుద్ధుని జీవితానికి సంబంధించిన ఈ కథలో, పర్యావరణ పరిరక్షణ గురించి ఒక కిటుకు దాగిఉంది. బుద్ధుని ద్వారా ఒక శాలువాని ఇప్పించుకోడానికి ఒక శిష్యుడు పడే పాట్లు చూడండి!

 

ఒక రోజు బుద్ధుడు తన ఆశ్రమం లో తిరుగుతూ ఉన్నాడు.

అప్పుడు ఒక సన్యాసి బుద్ధుడి వద్దకు కొత్త శాలువా కోసం వచ్చాడు.

బుద్ధుడు ఆ సన్యాసి తో పథ శాలువాకి ఏమి అయింది అని అడిగాడు.

“అది బాగా జీర్ణించుకుపోయింది. అందుకని ఎప్పుడు దాన్ని పరుచుకునే దుప్పటిగా వాడుకుంటున్నాను.”

“అయితే, నీ పరుచుకునే దుప్పటి ఏమి అయ్యింది?” అని అడిగాడు బుద్ధుడు.

“గురువుగారు, ఆ పరుచుకునే దుప్పటి బాగా మాసిపోయి చినిగింది. అందుకే, దాన్ని కత్తిరించి దానితో దిండు గలీబుని తయారు చేసాను.”

“కొత్త దిండు గలీబు తయారు చేసుకునే ముందు దాని స్థానంలో ఒక దిండు గలీబు ఉండి ఉంటుందే? అది ఏమి అయ్యింది?” అని బుద్ధుడు అడిగాడు.

“నా తల ఎక్కువగా ఆనించి వాడటం వాళ్ళ ఆ పాత దిండు గలీబులో చాల చిల్లులు పడ్డాయి.” దాన్ని నేను ఒక కాలి పట్టగా వాడుకుంటున్నాను.

బుద్ధునికి ఈ జవాబులతో ఇంకా తృప్తి కలగలేదు. విషయాలని తాను ఐప్పుడు క్షుణ్ణంగా పరిశీలించేవాడు.

“పాత పట్టా తో ఏమి చేసావు అయితే?”

ఆ సన్యాసి చేతులు జోడించి ఎలా అన్నాడు. “గురువు గారు, నా పాత కాలి పట్టా పూర్తిగా చినిగిపోయింది. దీని పోగులు, దారాలు అన్నీ ఊడివచ్చాయి.

అందుకని ఆ పోగులని అల్లి దానితో ఒక వత్తి తయారుచేసాను. తరువాత, ఆ వత్తి తో నా లాంతరు వెలిగించుకున్నాను.”

బుద్ధుడు సంతోషపడి ఆ సన్యాసికి ఒక కొత్త శాలువని ఇచ్చాడు.

 

 

Source: https://storyweaver.org.in

 

 

 

Advertisements