మహారాజుల ఇంట్లో పుట్టినా… భర్త వెంట అడవులకి వెళ్ళింది
నా రాముడు తోడుంటే అరణ్యమైనా… అంతఃపురమే అనుకుంది
రాముడు చెప్పాడని అగ్గిలో దూకింది..రాముడు పొమ్మన్నాడని గర్భిణిగా ఉన్నా అడవులకి వెళ్ళింది.
రాముని అనుసరించింది.. రాముని మాట శిరసావహించింది..
పోనీ.. రాముడు చెప్పినట్లు నడుచుకోవడానికి “సీత” ఏమైనా బలహీనురాలా అంటే….
అరణ్యవాసంలో రామునికి తోడుగా లక్ష్మణుడు, ఆంజనేయుడు.. మరి సీతకి లంకిణులు
పది తలల రావణాసురుని “గడ్డిపోచ”తో పోల్చిన తెగువ తనది..
భూదేవికున్న “ఓర్పు” తనది.. తండ్రికి తగ్గట్టుగా తనయులను తీర్చిదిద్దిన ఘనత తనది ..
అటువంటి “సీతమ్మ” రాముని పెళ్లి చేసుకున్న రోజు, రాముని పుట్టిన రోజు అయిన  చైత్రశుద్ధ నవమి రోజుని మనం “శ్రీ రామనవమి”గా జరుపుకుంటాం.
“శ్రీ రామనవమి” శుభాకాంక్షలు.
Advertisements