ఒక వర్తకుని దగ్గర ఓ చిలుక ఉంది.  అదంటే ఆయనకు ప్రాణం.  దాన్ని ఒక వెండి పంజరంలో వుంచి, దానికి రకరకాల పండ్లు, కాయలు పెట్టేవాడు. ఇంకా ఆ చిలుక కోరిన దేన్నైనా వెంటనె తెప్పించి పెట్టేవాడు. ఆ చిలుక చాల తెలివైనది. ఆయనతూ అది గంటలు గంటలు సంభాషించేది.

అయితే చిలుకకు పంజరంలూ ఉండటం ఇష్టం లేదు. స్వేచ్ఛగా బ్రతకటమే దానికిఇష్టం. తనను పంజరంలో నుండి తీసి స్వేఛగ వుండనివ్వమని అది ఆ వ్యాపారిని వేడుకునేది. చిలుక జాలిగా ఏన్ని సార్లు అడిగినా ఆ వర్తకుడు  “అది తప్ప వేరే ఏదన్నా అడుగు అనేవడు.”

ఓకరోజు చిలుక, “నాకు స్వేచ్ఛనిస్తే నీకు మూడు సలహాలు ఇస్తాను. అవి నీకు జీవితాంతం ఎంతో ఉపయోగపడతాయి” అంది.

ఆ వర్తకునికి చిలకంటే ఇష్టం. డబ్బంటే మరీ ఇష్టం. ‘దీని సలహాలు నాకు అంతులేనంత సంపద తెచ్చి పెడతాయేమో. అటువంటప్పుడు అది కోరుకున్నట్టు దానిని స్వేచ్చగా వదిలిపెడితే పోలా’ అని మనసులో అనుకుని పంజరం తలుపు తెరిచి, “వెళ్ళిపో” అన్నాడు.’

ఆ చిలుక ఆయన చేతి మీద వాలి, “నీకు ఇచ్చిన మాట ప్రకారం మూడు సలహాలు చెప్తాను. వాటిలో మొదటిది పోయిన సంపద గురించి ఎప్పుడూ విచారించకూడదు” అంది.

‘అది అంత మంచి సలహా ఏం కాదు.’ అనుకున్నాడు వర్తకుడు. కాని పైకి ఏమి అనలేదు. చిలుక ఆ ఇంటి పైకప్పు మీద వాలి, “నీకు చెప్పిందంతా నిజమని ఎప్పుడు నమ్మకు. ఇది నా రెండవ సలహా” అంది.

“నాకు తెలియనిదేదైనా చేప్పు” అన్నాడు వర్తకుడు కోపంగా.

“నా పొట్టలో రెండు అమూల్యమైన రత్నాలున్నాయన్న సంగతి నీకు తెలియదు” అంది చిలుక.

“రెండు అమూల్య రత్నాలా? నిన్ను స్వేచ్చగా వదిలిన నేనెంత మూర్ఖుణ్ణి ఇలా చేసినందుకు నా జీవితాంతం వగస్తూనే ఉంటాను” అన్నాడు, వర్తకుడు.

దానికి చిలుక కిలకిల నవ్వుతు “నా మూడవ సలహా వినాలని లేదా?” అంది.

“చెప్పు” అన్నాడు వర్తకుడు కోపంగా.

“పోయిన దాని గురించి దుఃఖించొద్దు అని నీకు సలహా ఇచ్చాను. కానీ నన్ను పోగొట్టుకున్నందుకు నువ్వు దుఃఖిస్తున్నావు. నువ్వు విన్నదల్లా ఎప్పుడు నమ్మకు అని చెప్పాను. కానీ నా కడుపులో రెండు అమూల్య రత్నాలు ఉన్నాయని చెప్పగానే వెంటనే నమ్మావు. ఒకవేళ నిజంగా నా కడుపులో రెండు రత్నాలుంటే నేను ఎలా బ్రతికి ఉండగలను? నా మూడవ సలహా ఏమిటంటే……’విను’. నీ చెవులతో కాకుండా మనసుతో విని నేర్చుకో……” అంటూ చిలుక రివ్వున ఎగిరిపోయింది. వర్తకుడు మాత్రం తెల్లముఖం వేసుకుని అది వెళ్ళినవైపే చూస్తుండిపోయాడు.

 

Advertisements