“జాతీయస్థాయిలో మెరిసిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు”
శిరస్త్రాణం(హెల్మెట్) పెట్టుకున్నపుడే వాహనం ఇంజన్ స్టార్ట్ అయ్యేలా, శిరస్త్రాణం తీయగానే ఇంజన్ ఆగిపోయేలా “ఆటోమేటిక్ హెల్మెట్” ను తయారుచేస్తే ….
రోగికి అమర్చిన సెలైన్ అయిపోగానే అప్రమత్తంచేసేలా – శిశువుల అపహరణ జరగకుండా ఆసుపత్రులలోనే తక్కువ ఖర్చుతోనే పరికరాలు సమకూరిస్తే…
ఇటువంటి ఆలోచనలతో “జాతీయ స్థాయి”లో మెరిశారు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు.
ఐఐటీ.. ఒలింపియాడ్ సిలబస్ అంటూ, వేలకువేలు ఫీజులు వసూలుచేస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలు సాధించలేనిది. ప్రభుత్వ పాఠశాల “విద్యార్థులు” సాధించి చూపించారు.
జాతీయ వైజ్ఞానిక, సాంకేతిక మూలాలైన సాంప్రదాయ విజ్ఞాన శాస్త్రాలు కాపాడాలన్న లక్ష్యంతో కేంద్ర ప్రభుత్వం జాతీయ స్థాయిలో “ఇన్స్పైర్(innovation in science pursuit for inspired research)” ద్వారా ప్రతిభావంతులైన విద్యార్థులని ప్రోత్సహిస్తోంది. ఈ విద్యా సంవత్సరానికి సంబంధించి గత ఆగస్టు/సెప్టెంబరు నెలలలో వేలాది మంది విద్యార్థుల ప్రాజెక్టుల పరిశీలన ఖరారు.. జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో జరిగింది. చివరికి దేశంలో అన్ని రాష్ట్రాల నుంచి  600 మంది విద్యార్థుల ప్రాజెక్టులు వచ్చాయి. వీటిలో తుదిగా 60 మంది విద్యార్థుల ప్రాజెక్టులను ఎంపిక చేశారు. వీరిలో ఆంధ్రప్రదేశ్ నుంచి ఎంపిక అయిన ఎనిమిది మంది “ప్రభుత్వ పాఠశాలలకు” చెందినవారే కావడం గమనార్హం. ప్రైవేట్ పాఠశాలల విద్యార్థులు జాతీయస్థాయి వరకు వచ్చినప్పటికీ తుది ఎంపికకు దూరమయ్యారు.
విద్యార్థులలో ప్రతిభను గుర్తించి వారికి దిశనిర్దేశం చేసిన గురువులకి, గొప్ప ఆలోచనలతో ప్రజలకి ఉపయోగపడే ప్రాజెక్టులను తయారుచేసిన విద్యార్థులను మనఃస్ఫూర్తిగా అభినందిద్దామా ఒకసారి.
వారు చేసిన ప్రోజెక్టుల వివరాలు:
New Doc_1.jpg
New Doc 1_1.jpg
Advertisements