ఒకసారి పక్షులకి, జంతువులకి యుద్ధం జరుగుతుంది. గబ్బిలానికి మాత్రం ఎవరివైపు యుద్ధంలో పాల్గొంటే తనకు మంచిదో ఆలోచిస్తూవుంది.
కొన్నిరోజుల గడిచాక యుద్ధంలో జంతువులు గెలిచేటట్లు ఉంటే జంతువుల తరుపున యుద్ధంలో పాల్గొంది.
ఇంకొన్ని రోజులకి పక్షులు గెలిచేటట్లు ఉంటే “నాకు రెక్కలు ఉన్నాయి, నేను కూడా పక్షి లాంటిదాన్నే, పక్షులతో యుద్ధం చెయ్యటం ఏమిటి” అని పక్షుల తరుపున యుద్ధంలో పాల్గొంది.
మరికొన్ని రోజులకి జంతువులు గెలిచేటట్లు ఉంటే “నేను క్షీరదాన్ని, పక్షులలాగా గుడ్లు పెట్టను, జంతువులలాగా పిల్లలను కంటాను. నేను జంతువునే” అని జంతువుల తరుపున యుద్ధంలో పాల్గొంది.
యుద్ధం వల్ల ప్రాణనష్టం తప్ప మరే ఉపయోగం లేదని తెలిసి యుద్ధం ఆపేశాయి పక్షులు,జంతువులు.
జంతువుల తరుపున యుద్ధం చేసావ్ అని పక్షులు గబ్బిలాన్ని తరిమేశాయి.
పక్షుల తరుపున యుద్ధం చేసావ్ అంటూ జంతువులు గబ్బిలాన్ని దగ్గరకి రానివ్వలేదు.
అందుకే అటు పక్షులతోను, జంతువులతోను కాకుండా గబ్బిలం పాడుబడిన ప్రదేశాలలో ఉంటుంది.
గెలిచినా, ఓడినా… స్నేహితులని, నమ్ముకున్న వాళ్లని సొంత ప్రయోజనాల కోసం విడిచి పెట్టకూడదు.
Advertisements