అక్బర్ చక్రవర్తి ఒక రోజు సభలో ఉన్న సమయంలో ఇద్దరు పండితులు వచ్చి వారి పాండిత్యాన్ని ప్రదర్శిస్తారు.
వారి ప్రతిభను మెచ్చుకున్న అక్బర్ చక్రవర్తి వారికి మంచి బహుమతులు అందచేస్తారు.
సంతోషంలో ఒక పండితుడు “రాజా ! మాకు ఇంత విలువైన బహుమతులు ఇచ్చిన మీరు దేవుడు కన్నా గొప్ప” అని పొగుడుతాడు.
అది నిజం కాదు అని అక్బర్ చక్రవర్తికి కూడా తెలుసు.
సభలోని వారి అభిప్రాయాన్ని తెలుసుకుందామని “అది నిజమా?” అని అడుగుతారు.
“కాదు” అంటే అక్బర్ చక్రవర్తికి కోపం వస్తుందేమో అని “అవును, మహారాజా మీరు ఆ దేవుడి కన్నా గొప్ప” అని అందరూ అంటారు.
బీర్బల్ వైపు చూసి బీర్బల్ నువ్వు ఏం అంటావ్ అని అడుగుతారు.
బీర్బల్ “ఖచ్చితంగా, నిజమే మహారాజా ! మీకు మీ సేవకులలో ఎవరిమీద అయినా కోపం వస్తే రాజ్యబహిష్కరణ చేస్తారు”
కానీ దేవుడు అలా చెయ్యలేడు ఎందుకంటే ఈ భూమి, ఆకాశం, సమస్త ప్రపంచం ఆయనదే, ఆయన లేని ప్రదేశం లేదు.
“రాజా ! మీరు దేవుడు చెయ్యలేని పనిని కూడా చెయ్యగలరు, కాబట్టి మీరు ఆ దేవుడి కన్నా గొప్ప” అని బీర్బల్ చాకచక్యంగా చెప్పదలుచుకున్న విషయాన్నీ తెలియచేస్తాడు.
Advertisements