మిత్రులారా! ఎలా వున్నారు..కుశలమా! అందరికి మంచి కథలతో పాటు, గొప్ప వాళ్ళు చెప్పిన మంచి విషయాలను అందించడం కథా పాఠశాల ముఖ్య ఉద్దేశ్యం.

ఈ రోజు మీకు మేము మీకు చెప్పబోతున్న ఆ మంచి విషయం ఏమిటి అంటే, ఒక దేశాధ్యక్షుడు తన కుమారుడి పాఠశాల ఉపాధ్యాయులకు రాసిన ఒక లేఖ. ఆ లేఖ ఇప్పటి తల్లిదండ్రులకు,తన తమ్ముళ్లకో/చెల్లళ్ళకో పాఠాలు నేర్పిస్తున్న అన్నయ్యలకి/అక్కలకీ, ఎప్పుడూ తరగతి పుస్తకాలూ తప్ప..ఇంకా ఏం చదవని విద్యార్థులకి , ఉపాధ్యాయులందరికి ఎంతో అవసరం, ముఖ్యం. మరి ఎందుకు ఆలస్యం ఆ లేఖ చదివేయండి..

గౌరవనీయులైనా ఉపాధ్యాయులకు …

అ) గెలుపుకి పొంగిపోకుండా ఓటమికి కుంగిపోకుండా అన్ని పరిస్థితులలోను స్థితగా ఉంటు ఏ కష్టాలు వచ్చినా ఆ సమయంలోను హాయిగా నవ్వుకోవడం ఎలాగో నేర్పించండి.

ఆ) గగనంలో ఎగిరేపక్షులు, సూర్యుని వెలుగులో తిరిగే తేనెటీగలూ, పచ్చని చేలపై పూసే పువ్వుల అంతుచిక్కని రహస్యాల గురుంచి ఆలోచించుకోడానికి కూడా సమయం కల్పించండి.

ఇ) అనుకోకుండా దొరికిన ఐదు డాలర్ల కన్నా కష్టపడి సంపాదించిన ఒక్క డాలర్ అయినా ఎంతో విలువైనదని నేర్పండి.

ఈ) ఈర్ష్య, ద్వేషాల నుండి దూరం చేయండి మనస్పూర్తిగా వచ్చే నవ్వులోని మర్మాలను చెప్పండి.

ఉ) తెలివితేటలతో డబ్బును సంపాదించవచ్ఛు కాని వ్యక్తిత్వాన్ని మాత్రం ధనార్జన కోసం అమ్ముకోకూడదని నేర్పించండి.

ఊ) ప్రతి ఒక్కరు చెప్పేది విని దానిలోని నిజాన్నే ఎలా నేర్చుకోవాలో అర్ధం అయ్యేలా బోధించండి.

ఋ) తన నమ్మింది నిజమని బలంగా విశ్వసిస్తే అందుకోసం ఎంతవరకైనా పోరాడటం నేర్పించండి.

ఎ) ఆప్యాయంగా మాట్లాడండి కాని అతిగా గరాభం చేయకండి. ఎందుకంటే నిప్పుల కొలిమిలో మాత్రమే ఉక్కుకు ఒక ఆకారం వస్తుంది.

ఇంతకీ ఆ అధ్యక్షుడు ఎవరో తెలుసా?.. చెప్పులు కుట్టుకునే స్థాయి నుండి దేశానికే అధ్యక్షుడైన “అబ్రహం లింకన్”.. చాలా మంచి విషయాలు చెప్పారు కదా!.. ఇలాంటివే మరిన్ని మంచి కథలతో, మంచి విషయాలతో మీ ముందుకు వస్తుంది మీ “కథా పాఠశాల”.

Advertisements