అలా పారిపోతున్న పులిని నక్క ఆపి ” మిత్రమా! ఏం జరిగింది, ఎందుకలా భయంగా పరిగెడుతున్నావ్’ అని ప్రశ్నించింది.
“అక్కడా … ఒక మేక… 999 ఏనుగులు, పులులు చంపిందట. అది వెయ్యవ ఏనుగును చంపి, దానిపై కూర్చుని నా వైపు భీకరంగా చూసి నిన్ను కూడా చంపితే 1000 పులులు అవుతాయి అని అరిచింది, దాని బారి నుండి తప్పించుకుని వస్తున్నాను” అని చెప్పింది పులి.
నక్క పకపకా నవ్వి.. “మిత్రమా! నీ వంటి పులిని మేక చంపడమా? భలే ఉందే.. ఆ మేకను చూపించు, దానిని చంపి ఏనుగు, మేకల మాంసంతో విందు చేసుకుందాం” అంది.
పులి అందుకు ఒప్పుకోలేదు. “సరే ఒక పని చేద్దాం.. నీకు అంతగా భయం వేస్తే నన్ను ఒక తాడుతో నీ తోకకు కట్టేయ్, ముందు నేను నడుస్తాను. నిజం ఏమిటో తెలుసుకుందాం..నాకు దారి చూపించు” అని నక్క పులిని ఒప్పించి ఆ చోటికి తీసుకెళ్తుంది.
పులి, నక్క కలిసి రావడాన్ని గమనించిన మేక.. “నక్క బావ నీకు చెప్పి ఎన్ని రోజులు అయ్యింది.. నీ మాయమాటలతో పులిని మోసం చేసి తీసుకురమ్మని.. పోనిలే నా దగ్గర నుంచి తప్పించుకున్న పులిని ఎలాగైతే తిరిగి తీసుకువచ్చావ్.. శభాష్ ! ఈ రోజు నీకు పులి మాంసంతో విందు భోజనం” అని అంది.
ఈ నక్క నన్ను మోసం చేసి తీసుకు వచ్చింది..ఎలా అయినా నా ప్రాణం కాపాడుకోవాలని పులి వేగంగా పరిగెత్తింది. పులి తోకను తన తోకకు కట్టుకోవడంతో నక్కను కూడా ఈడ్చుకు వెళ్ళింది.
అలా పులిని కాపాడబోయి నక్క దెబ్బలు తగిలించుకుంది.
సమయస్ఫూర్తి ఉంటే ఎలాంటి సమస్య అయినా చిటికెలో పరిష్కారం అవుతుంది అని మేక మనకు చెప్పేకనే చెప్పింది.

 

Advertisements