ఒక అడవిలో ఒక పులి ఉండేది. ఒకరోజు దానికి బాగా ఆకలి వేసింది. వేటకు బయలుదేరింది. దానికి ఏ జంతువూ దొరకలేదు. ఆహారం కోసం చాలా దూరం నడిచింది.
అడవిలో ఒక సరస్సు వుంది. దానిలో నీరు త్రాగడానికి ఒక ఏనుగు అక్కడికి వచ్చింది. అది నీరు త్రాగబోతుండగా, పులి కూడా నీరు త్రాగడానికి అక్కడికి వచ్చింది. పులిని చూసి ఏనుగు పరిగెత్తింది.
అలా భయంతో పరిగెడుతున్న ఏనుగుని దారిలో ఒక మేక “ఏనుగు బావా!…  ఏమైంది? ఎందుకలా పరిగెడుతున్నావ్” అని అడిగింది.
“అదిగో పులి, మంచి ఆకలితో వస్తుంది. దొరికితే నంజుకు తింటుంది. అందుకే ఇలా పరిగెడుతున్న” అంటూ భయంతో చెప్పింది ఏనుగు.
“ఏనుగు బావా .. నువ్వు ఎంత వేగంగా పరిగెత్తిన, పులి కన్నా వేగంగా పరిగెత్తలేవు. దాని పంజా నుండి తప్పించుకోలేవు. నేను చెప్పినట్లు చెయ్యి, నువ్వు ప్రాణాలతో బయట పడగలుగుతావు.” అంది మేక.
“ఏం చేయమంటావ్?”  అన్నది ఏనుగు.
“నువ్వు కదలకుండా నేలపై పడుకో, ఏం జరిగినా నువ్వు కదలవొద్దు” అన్నది మేక.
ఏనుగు సరే అని, నేలపై పడుకుంది. దాని పై మేక నిలుచుని, పులి కోసం ఎదురుచూస్తూవుంది. ఈలోపు పులి రావడం గమనించి మేక నవ్వుతూ…
“నేనిప్పటికి 999 ఏనుగులు, పులులు చంపాను.. ఈ రోజు ఏనుగు దొరికింది, పులి దొరకలేదే అనుకుంటున్నాను. దేవుని దయ వల్ల దానిని కూడా చంపితే మొత్తం వెయ్యి ఏనుగులు, పులులు చంపిన దానిని అవుతాను.. హ్హ హ్హ హ్హ … “అన్నది.
ఏనుగుపై ఎక్కి మేక ధైర్యంగా ఆ మాటలు అనడం పులి నమ్మింది.
బ్రతికుంటే బలుసాకు తినొచ్చు.. ఆ మేక దగ్గరకు వెళితే ఆ ఏనుగును చంపినట్లు నన్ను కూడా చంపుతుంది. అనుకుంటూ అక్కడి నుంచి పారిపోయింది ఆ పులి.
కథ ఇక్కడితో అయిపోలేదు… పార్ట్ 2 కూడా ఉంది.. అది చదవడానికి సిద్ధంగా వుండండి ఆదివారం (5/03/217).
Advertisements