అనవసరపు వర్ణనలు, గుర్తుపెట్టుకోలేనన్ని పాత్రలు, పేజీలకు పేజీల కథలు…
ఇలా కాకుండా సూటిగా, సుత్తిలేకుండా కథలు ఉంటే..
“పిట్ట కొంచెం కూత ఘనం” అన్న చందాన పేజీకి మించని కథలు
కానీ అవి అందించే వినోదం, విజ్ఞానం మాత్రం అమోఘం. 
అవే “ఈసపు కథలు” / Aesop Fables.
 
“అందని ద్రాక్షలు పుల్లన”, “ఉట్టికి ఎగురలేనమ్మ, స్వర్గానికి ఎగిరిందంట”
“కడివెడు గాడిద పాల కన్నా, గరిటెడు గోవు పాలు మిన్న” ఇలాంటి సామెతలు విని వుంటారు.
అవి ఎలా వచ్చాయో చెప్పే కథలు ఈ “ఈసపు కథలు”. 
“గెలిచినా, ఓడిన స్వజాతిని వీడొద్దు” అని మంచి విషయాలను చెప్పే కథలు. .. 
“మనకన్నా బలహీనులు, కష్టాలు పడుతున్నవారు వుంటారు, చావు ఏ సమస్యకు పరిష్కారం కాదు” అని ఆత్మ స్థైర్యం నింపే కథలు… 
“నమ్ముకున్న వారిని రక్షించలేని వాడు నాయకుడు కాలేడు,” అని నాయకత్వపు కథలు.. 
ఇలా అన్ని వయసుల వారిని అలరించే కథలే ఈ “ఈసపు కథలు”. 
If you want to buy this book, please visit the below site

http://manchipustakam.in/ 

Advertisements