ఓవృద్ధుడు రోజూ వచ్చి బుద్ధుడి విగ్రహానికి నమస్కరించేవాడు. ఆతర్వాత కాసేపు ధ్యానం చేసి వెళ్లిపోయేవాడు. ‘మీరు ఎన్నో ఏళ్ల నుంచీ బుద్ధుడిని ప్రార్థిస్తున్నారు కదా! ఆయన మీతో ఏమైనా చెప్పారా?’ అని అడిగాడో వ్యక్తి. ‘బుద్ధుడు ఎప్పుడూ ఏమీ చెప్పడు. అన్నీ వింటాడు’ – జవాబిచ్చాడు వృద్ధుడు. ‘అయితే, మీరు బుద్ధుడితో ఏం చెబుతుంటారు?’ ‘నేను ఎప్పుడూ ఏమీ చెప్పను. అన్నీ వింటాను’- అన్నాడు వృద్ధుడు.

Advertisements