అనగనగా ఒక ఊరిలో ఒక అబ్బాయి, ఒక అమ్మాయి ఉండేవారు. వాళ్లిద్దరూ రోజు కలిసి ఆడుకొనేవారు. అబ్బాయి దగ్గర బొమ్మలు ఉండేవి , అమ్మాయి దగ్గర చాకోలెట్స్ ఉండేవి. ఒక రోజు ఆ అబ్బాయి ” నీ చాకోలెట్స్ నాకు ఇస్తావా? బదులుగా నేను నా బొమ్మలన్నీ నీకు ఇచ్చేస్తా అని” అమ్మాయిని అడుగుతాడు. అందుకు అమ్మాయి ఒప్పుకుంటుంది. కానీ అబ్బాయి మాత్రం మంచి బొమ్మలు తన దగ్గరే ఉంచుకొని, మిగిలినవి ఆ అమ్మాయికి ఇచ్చేస్తాడు. ఆ అమ్మాయి మాత్రం తన దగ్గర ఉన్న అన్ని చాకోలెట్స్ ఇచ్చేస్తుంది.

ఆ రోజు రాత్రి అమ్మాయి చాలా ప్రశాంతంగా నిద్రపోతుంది. అబ్బాయికి మాత్రం నిద్ర పట్టదు, “ఆ అమ్మాయి కూడా నాలానే మంచి చాకోలెట్స్ తన దగ్గరే ఉంచుకొని, మిగిలినవి నాకు ఇచ్చిందేమో అని” అనుమానిస్తూ ప్రశాంతంగా నిద్రపోలేక పోతాడు. మంచి బొమ్మలు, చాకోలెట్స్ అన్ని ఉన్నా కూడా తను సంతోషంగా ఉండలేకపోతాడు. మిత్రులారా! చూసారు కదా, మనం మన బంధువులతో కానీ, స్నేహితులతో కానీ, రిలేషన్ లో కాని ఇలా 100% ప్రేమను ఇవ్వకుండా..సగం సగం ఇస్తూఉంటే ఇలానే అనుమానిస్తు,హ్యాపీగా ఉండలేం.కాబట్టి ఇచ్చేద్దాం 100% ప్రేమని, జీవిద్దాం సంతోషంగా, ప్రశాంతంగా.

Advertisements